Oppo A5 Pro 5G: బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్.. స్టైలిష్ డిజైన్, ప‌వ‌ర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్ తో "ఒప్పో A5 ప్రో".. 10 month ago

featured-image

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo తాజాగా తమ A సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌ను "Oppo A5 Pro" విడుదల చేసింది. ఇది తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను ఇస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్, శక్తివంతమైన ప్రాసెసర్‌, వాటర్ రెసిస్టన్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ప్రస్తుత మార్కెట్లో అత్యాధునిక కనెక్టివిటీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇది బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారికి ఒక మంచి ఎంపిక. ఒకసారి ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.!


Oppo A5 Pro 5G ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.67 అంగుళాలు HD+ LCD

రిఫ్రెష్ రేట్: 120 Hz

ప్రాసెసర్: MediaTek Dimensity 6300

పీక్ బ్రైట్‌నెస్: 1000 nits

ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, ColorOS 15

బరువు: 194 గ్రాములు

బ్యాటరీ: 5800 mAh

ఛార్జింగ్: 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్


కెమెరా ఫీచర్లు:

బ్యాక్ కెమెరా:

  • 50 MP మెయిన్ కెమెరా
  • 2 MP మోనో కెమెరా

ఫ్రంట్ కెమెరా: 8 MP


వేరియంట్స్:

  • 8GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 256GB స్టోరేజ్


కలర్ ఆప్షన్స్:

  • ఫెదర్ బ్లూ
  • మోచా బ్రౌన్


కనెక్టివిటీ ఫీచర్లు:

  • 5G, 4G డ్యూయల్ సిమ్
  • Wi-Fi 5
  • బ్లూటూత్ 5.3
  • USB టైప్-C
  • NFC


సెన్సార్లు: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్


ధరలు:

  • 8GB RAM, 128GB స్టోరేజ్ -- ₹17,999
  • 8GB RAM, 256GB స్టోరేజ్ -- ₹19,999


ప్లస్ పాయింట్స్:

  • మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ (MIL-STD-810H)
  • IP66, IP68, IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
  • స్టీరియో స్పీకర్లు


మైనస్ పాయింట్స్:

  • HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే (కొంతమందికి తక్కువగా అనిపించవచ్చు)
  • ప్రత్యేకమైన టెలిఫోటో లెన్స్ లేదు


Oppo A5 Pro 5G తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ సాధారణ ఉపయోగానికి.. గేమింగ్ కు చాలా బాగుంటుంది. ఇది మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ & వాటర్ రెసిస్టెంట్ మొబైల్. ఇవే ఈ మొబైల్ కు హైలైట్ అని చెప్పుకోవచ్చు. సాధారణ వినియోగదారులకు మరియు మన్నికకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది చక్కని ఎంపిక. అయితే.. ఈ ఫోన్‌లో చెప్పుకోతగ్గ AI ఫీచర్లు.. కెమెరా ఫీచర్లు లేవు. మంచి AI కెమెరా ఫీచర్లు కలిగిన మొబైల్ కావాలంటే.. ఇదే ధరకు "Vivo T4x" మంచి ఎంపికగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్ లో మాత్రమే సేల్ కు ఉంది.. ఫ్లిప్‌కార్ట్ సేల్ కు కాస్త ఎదురు చూడాల్సిందే.



ఇది చదవండి: అందుబాటు ధరలో 108MP కెమెరా ఫోన్..5G వేగం, 33W టర్బో ఛార్జింగ్ కూడా..



Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD